వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి: బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిజామాబాద్‌కు చెందిన శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
సంస్థ అధ్యక్షుడు టి. శ్రీనివాసచారి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినా విద్యార్థులు చదువులో రాణించాలని, విద్యతోనే కుటుంబ స్థితిగతులు మారుతాయని అన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, వార్డు సభ్యుడు బోదాసు శ్రీను, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

