వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రమేశ్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు స్టేషన్‌లోని వివిధ గదులను చూపించి, వాటి వినియోగాన్ని వివరించారు.
పోలీసుల విధులు, ప్రజలకు అందించే సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్రను వివరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

