Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్. గోపాల్.

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 7:40 PM వికారాబాద్General
విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్. గోపాల్. - Udayam
*ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ* ​వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మద్గుల్ చిట్టెంపల్లి ప్రభుత్వ పాఠశాలలో బిఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ గోపాల్ ముదిరాజ్ కూతురు లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ పాండు, వార్డు ప్రజల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాల్ ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలోలాగే భవిష్యత్తులోనూ వార్డు ప్రజలకు, పాఠశాల అభివృద్ధికి తనవంతు సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...