Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు నేత్రదానంపై అవగాహన

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 6:12 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు నేత్రదానంపై అవగాహన - Udayam
మందస మండలం బహడపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ 160 మంది విద్యార్థులను పరీక్షించగా, 22 మందికి దృష్టిలోపం గుర్తించి కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. నేత్రదానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డి. కేశవరావు సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...