వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సింగుపురం కేజీబీవీలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒత్తిడి నియంత్రణ, సానుకూల ఆలోచనలు, భావోద్వేగాల నిర్వహణపై మెంటల్ హెల్త్ కౌన్సిలర్ సూర్యప్రభ అవగాహన కల్పించారు.
ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు మానసిక ఆరోగ్య ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

