Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి చదువుకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 5:02 PM నాగర్ కర్నూల్General
విద్యార్థి చదువుకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల కు చెందిన కొంగరి బాలస్వామి కుమార్తె రేవతి బీపీఎడ్ కోర్సులో సీటు సాధించింది. ఆర్థిక పరిస్థితుల వల్ల కళాశాల ఫీజు చెల్లించడం కష్టంగా మారింది. బుధవారం విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రూ.32,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసి పేద విద్యార్థి చదువుకు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...