వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద యువజన సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘విప్లవం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.
భగత్ సింగ్ జీవిత చరిత్ర, దేశభక్తి, పోరాట స్ఫూర్తిని యువతకు వివరించారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

