వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలం వెల్లంపల్లి బీసీ కాలనీలో 33 కేవీ విద్యుత్ వైర్లు ఇళ్లపై చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

