వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్దిలో దారుణం జరిగింది. వడ్డూరి శ్రావణ్ కుమార్ (33) అనే వ్యక్తి తన తల్లి దుర్గమ్మ గొంతు కోసి, అనంతరం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తీవ్రంగా గాయపడిన దుర్గమ్మను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి నరసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని, ఆస్పత్రిలో బాధితురాలిని ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించారు.
Comments
Loading comments...

