వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడ మండలం కేజీపూడి పంచాయతీ పరిధిలోని సంఘం వలసలో గురువారం వేపాడ పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

