Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేముల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 12:17 PM కడపGeneral
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల గ్రామపంచాయతీ నామినేషన్ కేంద్రం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా డీఎస్పీ మురళి నాయక్ అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. అభ్యర్థులను వెంటనే కేంద్రంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Comments

G
Loading comments...