Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Jul 27, 2026 8:58 PM మంచిర్యాలGeneral
వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలి - Udayam
కవ్వాల్ అభయారణ్యంలో ప్రజలపై అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపేలా చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. సోమవారం సాయంత్రం హైదరాబాదులో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అభయారణ్యంలో ఎకో జోన్ పై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాలన్నారు. అలాగే రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి ఆటంకం కల్పించవద్దని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...