వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కలెక్టర్ బానోత్ వనజ నాయక్‌ను రేషన్ డీలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షులు మద్దెల నరసయ్య ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. నూతన తహసీల్దార్‌తో భేటీ అయిన డీలర్లు, ప్రభుత్వ పథకాల అమలులో తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

