Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సేవ విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 6:58 PM శ్రీకాకుళంGeneral
వైద్య సేవ విస్తరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత - Udayam
కూటమి ప్రభుత్వం వైద్యరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ బ్లాక్‌లో 25 ఐసోలేషన్ పడకలు, డయాలసిస్, క్యాథ్ ల్యాబ్, రెండు శస్త్రచికిత్స గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు, రోగుల సహాయకులకు వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...