వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి పల్లకి సేవ మహోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సువర్చల సమేత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పల్లకిలో ప్రతిష్ఠించారు.
భక్తులు పల్లకిని భుజాలపై మోస్తూ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో పునీతులయ్యారు.
Comments
Loading comments...

