వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని శ్రీ లోకమాత పోచమ్మతల్లి ఆలయ 64వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు.
వేద పండితులు తిగుళ్ల విశ్వనాథ్ శర్మ, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

