వార్తలకు తిరిగి వెళ్లండి

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి 'స్పష్టమైన అల్పపీడనం'గా మారిందని SDMA తెలిపింది. రాబోయే 22 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Comments
Loading comments...

