వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: ఔటర్ రింగ్‌రోడ్డుపై కీసర–శామీర్‌పేట మార్గంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం వెనుక టైరు పేలి అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో మంగీలాల్ (60), సురేఖ (40) మృతి చెందారు. మరో 11 మంది కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

