వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద గెడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో ఏటిగైరంపేట నుంచి రోలుగుంట మండలంలోని ఎంకే.పట్నం, బీబీ.పట్నం, రత్నంపేట గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు వద్ద పలువురు రాకపోకలు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

