వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలంలోని దేవుగూడ, మారుగూడ తదితర ఆదివాసీ గూడాల్లో శుక్రవారం జాగేయ్ మాతరి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు వెదురు కర్రలు పట్టుకుని ‘జాగేయ్ మాతరి’ అంటూ గ్రామ శివారుకు వెళ్లారు.
అక్కడ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వర్షాకాల వ్యాధుల నుంచి విముక్తి కలగాలని సంప్రదాయబద్ధంగా ప్రార్థించారు.
Comments
Loading comments...

