Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ విద్యా బోధనతోనే మంచి భవిష్యత్తు

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 10:25 AM మంచిర్యాలGeneral
ఉత్తమ విద్యా బోధనతోనే మంచి భవిష్యత్తు - Udayam
ఉత్తమ విద్యా బోధనతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామ జడ్పీ పాఠశాల హెచ్ఎం యశోదర అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచిగా పాఠాలను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...