వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని తండాల్లో తీజ్ ఉత్సవాలు జోరందుకున్నాయి. రాఖీ పౌర్ణమి రోజు ప్రారంభమైన వేడుకలు కృష్ణాష్టమి వరకు కొనసాగనున్నాయి. పండుగ సమీపిస్తుండటంతో తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
యువతులు ఉదయం, సాయంత్రం తీజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాల కోసం బయటకు వెళ్లిన వారు సైతం తండాలకు చేరుకొని ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

