వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. 30 కోట్లతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్‌లో నిర్వహణ లోపాలు వేధిస్తున్నాయి. తరచూ లిఫ్టులు మొరాయించడంతో ప్రయాణికులు గంటల తరబడి లోపలే ఇరుక్కుపోయి నరకం చూస్తున్నారు. అత్యవసర సమయంలో పవర్‌బ్యాకప్ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
స్కైవాక్‌పై సరైన శుభ్రత, లైటింగ్ లేకపోవడం వల్ల పాదచారులు జారిపడుతున్నారు. వర్షం పడితే నీరు కారడం, ఎస్కలేటర్లు మొరాయించడం వంటి సమస్యలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కైవాక్ నిర్వహణను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

