వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రానున్న 15 ఏళ్ల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ మార్కెట్‌లో నిలబడాలంటే ఉత్పత్తిని పెంచి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని, అలాగే రామగుండం పరిసరాల్లోని పరిశ్రమలను దృష్టిలో ఉంచుకుని 'కోల్ గ్యాసిఫికేషన్' ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
సింగరేణికి 'సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్' స్టేటస్ తొలగించడం వల్ల అటవీ భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి కేంద్ర మంత్రికి వివరించారు.
Comments
Loading comments...

