Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనుల్లో రూ.42 లక్షల అక్రమాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:52 PM అనంతపురంGeneral
ఉపాధి హామీ పనుల్లో రూ.42 లక్షల అక్రమాలు - Udayam
మండలంలో రూ.15.75 కోట్లతో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలో రూ.42 లక్షల మేర అక్రమాలు వెలుగుచూశాయి. 2025 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 18 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులపై బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. రూ.36.22 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించగా, రూ.5.71 లక్షల పనులను సిబ్బందితో తిరిగి చేయించాలని ఆదేశించారు. రూ.24,166 రికవరీతో పాటు రూ.33,500 జరిమానా విధించారు.

Comments

G
Loading comments...