వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో అధికారులు పర్యవేక్షణ లోపించడంతో, అనుమతులు తీసుకోకుండానే కొత్త గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనివల్ల పురపాలికకు రూ.లక్షల్లో ఆదాయం గండి పడుతోంది. మున్సిపాలిటీ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నా, యజమానుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు.
నిర్మాణాలు సాగుతున్న ప్రాంతాల్లో అవగాహన కల్పించి, రుసుం చెల్లించేలా చూస్తామని అధికారులు తెలిపారు. అనుమతులు ఉంటేనే భవిష్యత్తులో రుణాలు పొందడం సులభతరమని, యజమానులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

