Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 10:32 AM జాతీయంGeneral
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి - Udayam
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా మజల్తాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం సాయంత్రం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బలగాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కాల్పులు మొదలయ్యాయి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల ఎస్‌ఓజీ సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల గుర్తింపును అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...