వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని నిరుద్యోగ యువత ఈజీఎంఎం పథకం ద్వారా అందించే ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కోరారు. కంప్యూటర్, టైలరింగ్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సంబంధిత పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించడమే పథకం లక్ష్యమని ఎంపీడీవో పేర్కొన్నారు.
Comments
Loading comments...

