వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా హాలహర్వి శివారులోని ఛత్రగుడి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. కర్నూలు నుంచి బళ్లారి వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఝార్ఖండ్‌కు చెందిన డ్రైవర్ ఉమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని ఆలూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీలను తొలగించి, నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments
Loading comments...

