Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డీఈవో అత్యవసర ఆదేశాలు

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 4:06 PM పార్వతీపురం మన్యంGeneral
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డీఈవో అత్యవసర ఆదేశాలు - Udayam
భారీ వర్షాలు, తుఫాన్ సూచనల నేపథ్యంలో పార్వతీపురం జిల్లాలోని పాఠశాలల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, కాలువల వద్దకు విద్యార్థులను అనుమతించవద్దన్నారు. లైట్లు, ప్రథమ చికిత్స సామగ్రి, తాగునీరు సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే ఎంఈవోలకు సమాచారం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...