Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో భారీ చోరీ: 4 కేజీల వెండి, బంగారం అపహరణ

వివేక్ గౌడ్ Jul 09, 2026 8:49 AM కాకినాడ 2 viewsabout 2 hours ago
తునిలో భారీ చోరీ: 4 కేజీల వెండి, బంగారం అపహరణ - Udayam Digital
కాకినాడ జిల్లా తుని బ్యాంక్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు చొరబడి 4 కేజీల వెండి, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వెనుక తలుపులు పగులగొట్టి, సీసీ కెమెరాను పక్కకు తిప్పి ఈ దోపిడీకి పాల్పడ్డారు. గ్లౌజులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్డుతో హల్‌చల్ చేస్తూ పక్క ఇళ్లలోనూ చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...