వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సుంకేసుల జలాశయంలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలకు నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా కొంతకాలం నీరు అందించినప్పటికీ, నదిలో నీరు తగ్గడంతో మోటార్లు నిలిచిపోయాయి. జలాశయాన్ని నమ్ముకుని సాగు చేసిన వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

