వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో తుంగభద్ర జలాశయం నిండుతోంది. గురువారం ఉదయం 7.30 గంటలకు 12,340 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 94.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జలాశయం నిండేందుకు మరో 11 టీఎంసీల నీరు అవసరం ఉంది. దిగువ ప్రాంతాల అవసరాల కోసం నది ద్వారా 8,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

