Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 19, 2026 3:39 PM కర్నూలుGeneral
తుంగభద్ర జలాశయానికి తగ్గిన ఇన్ ఫ్లో - Udayam
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం నాటికి డ్యాంలోకి 1,137 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం కాల్వల ద్వారా 3,493 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 25.99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...