Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ మందిర నిధుల లూటీపై ఉద్ధవ్ ఫైర్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 18, 2026 11:36 PM జాతీయంGeneral
రామ మందిర నిధుల లూటీపై ఉద్ధవ్ ఫైర్ - Udayam
శ్రీరాముడిని రక్షించుకోవడమే మన బాధ్యత అని శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రామ మందిర విరాళాలు లూటీకి గురవుతున్నాయని, ఇదేనా మీరు కోరుకున్న హిందూ రాష్ట్రం అని మోహన్ భగవత్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. బీజేపీ హిందుత్వాన్ని విడిచిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. సిట్ దర్యాప్తు కేవలం ఒక నాటకమని, దీనిపై రిటైర్డ్ న్యాయమూర్తితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొంగలు, రామభక్తుల మధ్య జరుగుతున్న ఈ పోరాటాన్ని మహారాష్ట్రతో పాటు అయోధ్య, కాశీ వరకు తీసుకెళ్తామన్నారు.

Comments

G
Loading comments...