వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు నుంచి పెదపరిమి వెళ్లే రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక క్రేన్, ఒక లారీతో పనులు చేపడుతున్నారని చెబుతున్నారు. రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ద్విచక్ర వాహనాలు పాడవుతున్నాయని వాపోతున్నారు.
ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారి పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

