వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ఎం.ఎస్. హైదర్ వలి మృతి చెందారు. ఆయన మృతిపై పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతివార్త తెలుసుకున్న వారు స్వగ్రామానికి చేరుకుని నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ బలోపేతానికి హైదర్ వలి చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

