వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం

అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల గుర్తుగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో సరికొత్త బంగారు నాణేన్ని ముద్రిస్తున్నట్లు యూఎస్ టంకశాల ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక డాలర్ నాణెం ఫస్ట్‌లుక్‌ని ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ విడుదల చేశారు.
ఈ నాణెం అమెరికా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, శాశ్వత వారసత్వానికి చిహ్నంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా ముద్రిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Comments
Loading comments...