వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి

మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు జాతీయ రహదారి వంతెనపై గొడవ పడుతున్న ఇద్దరు లారీ డ్రైవర్లను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఆరుస్వామి మురుగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
తీవ్రంగా గాయపడిన విజయవాడ డ్రైవర్ సత్యప్రసాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...