Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురాంతకం ఎన్నెస్పీలోకి సాగర్‌ జలాలు.

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:01 PM ప్రకాశం General
త్రిపురాంతకం ఎన్నెస్పీలోకి సాగర్‌ జలాలు. - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల కోసం విడుదలైన సాగర్‌ జలాలు ఆదివారం త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌లోకి ప్రవేశించాయి. తొలుత 475 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం సాయంత్రానికి 1,500 క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం కురిచేడు సబ్‌ డివిజన్‌లోకి నీరు ప్రవేశిస్తుందని అధికారులు తెలిపారు. సాగర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా 15 రోజుల పాటు రోజుకు 2,000 క్యూసెక్కుల చొప్పున నీరు సరఫరా కానుంది.

Comments

G
Loading comments...