Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరిగొప్పులలో బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:12 AM జనగామ General
తరిగొప్పులలో బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - Udayam
తరిగొప్పులలో బెల్ట్‌ షాపుల నియంత్రణపై ఆగస్టు 14న గ్రామసభలో తీర్మానం చేసినా అమలు కావడం లేదని ప్రతిపక్ష నాయకులు, యువత ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా, సరఫరా చేసే లైసెన్స్‌దారులకు రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించినా బెల్ట్‌ షాపులు కొనసాగుతున్నాయని విమర్శించారు. పాలకవర్గం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...