వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర 48 మంది దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,800 మందికి ఈ వాహనాలు అందిస్తున్నామని తెలిపారు.
70 శాతానికి పైగా అంగవైకల్యం ఉండి పదోతరగతి చదివిన వారికి రూ.1.15 లక్షల విలువైన ట్రై సైకిళ్లు అందజేస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...
