వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని భాజపా శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతీయ సమగ్రత కోసం ముఖర్జీ చేసిన కృషిని, కశ్మీర్‌లో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

