వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలో ‘మన తెలంగాణ’ విలేకరి రాఘవేంద్రపై జరిగిన దాడిని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకే దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

