వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు సిబ్బంది పిల్లల కోసం సంగారెడ్డిలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఎంతో ఉపయుక్తమని, 'స్పార్క్' కార్యక్రమం అభినందనీయమని డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ కొనియాడారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి, కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

