Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిటీ బస్సులు, ఆటోలపై రవాణా శాఖ చర్యలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 31, 2026 3:15 PM నెల్లూరుGeneral
సిటీ బస్సులు, ఆటోలపై రవాణా శాఖ చర్యలు - Udayam
నెల్లూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సిటీ బస్సులు, ఆటోలపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అపసవ్యంగా పార్కింగ్ చేసిన 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.20 లక్షల జరిమానా విధించారు. బస్సులు, ఆటోలను రవాణా శాఖ కార్యాలయానికి తరలించి యాజమాన్యాలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...