వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర రవాణా శాఖలో అధికారుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో అన్ని విభాగాల్లోని సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. అయితే, ఏ విభాగంలోనూ మొత్తం సిబ్బందిలో 40% కి మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను మే 31 లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.
బదిలీలతో పాటు పలువురు అధికారులకు పదోన్నతులు (ప్రమోషన్లు) కూడా కల్పించనున్నారు. ఒక డీటీసీకి జేటీసీగా, నలుగురు ఎంవీఐలకు ఆర్టీవోలుగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. ఈ బదిలీలకు సంబంధించిన తుది జీవో (GO) మే 30 లేదా 31 న విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...

