వార్తలకు తిరిగి వెళ్లండి
హంగేరీలో పోలాండ్ పర్యాటకులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
మెజోకెరెష్టెస్ సమీపంలోని ఎం3 హైవేపై ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. అందరూ పోలండ్ పౌరులేనని విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Loading comments...

