వార్తలకు తిరిగి వెళ్లండి
సంగారెడ్డిలో విషాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు నీటిలో సెల్ఫీలు తీసుకుంటూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
మృతులను సతీష్(17), ప్రశాంత్(19)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.
Comments
Loading comments...