Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పిపోయిన ఇద్దరు బాలురి గుర్తింపు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:05 PM మహబూబాబాద్ General
తప్పిపోయిన ఇద్దరు బాలురి గుర్తింపు - Udayam
చేపల వేటకు వెళ్లి దారి తప్పిన నవాబుపేటకు చెందిన మైనర్‌ బాలురు ఎల్లంపల్లి వెంకటేశ్‌, ఎల్లంపల్లి వెంకటేశ్వర్లును పోలీసులు గుర్తించారు. ట్రాలీలో దంతాలపల్లి సెంటర్‌కు చేరుకున్న బాలురు అక్కడ తిరుగుతుండగా పెట్రోలింగ్‌ కానిస్టేబుళ్లు సుధాకర్‌, గణేశ్‌ గుర్తించారు. వెంటనే ఎస్‌ఐ రవికుమార్‌, నవాబుపేట సీఐకి సమాచారం అందించారు. బాలురను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...